కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ గుడ్-బై

June 22, 2018


img

గ్రేటర్ హైదరాబాద్ మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాకు కారణాలు వివరిస్తానని చెప్పారు.

దానం నాగేందర్ రెండేళ్ళ క్రితమే తెరాసలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ అప్పుడు పార్టీలో అందరూ నచ్చచెప్పడంతో వెనక్కు తగ్గారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తనకు పార్టీలో ఏదైనా కీలకపదవి లభిస్తుందని ఇంతకాలం ఆశగా ఎదురుచూస్తే, ఆయనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా హైదరాబాద్ నగర అధ్యక్ష పదవిని అంజన్ కుమార్ యాదవ్ కు అప్పగించడంతో అయన పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో తెరాస తప్ప మరే ఇతర పార్టీ బలంగా లేదు కనుక బహుశః అయన తెరాసలోనే చేరుతారేమో? రేపు మీడియా సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.Related Post