తెలంగాణాలో కొత్తజోన్లు ఏర్పాటు

May 25, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వోగుల సౌకర్యార్ధం ఇదివరకున్న జోన్ల స్థానంలో కొత్తగా 7 జోన్లు, 2 మల్టీ జోన్లును ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. 

ఈ అంశంపై నిన్న ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించిణ తరువాత కొత్త జోన్స్ ఏర్పాటు చేయలని నిర్ణయించారు. ఒక్కో జోన్ లో కనీసం 4-5 కొత్త జిల్లాలు ఉండేవిధంగా దీనిని రూపొందించారు. ఒక్క ఛార్మినార్ మినహా మిగిలిన 6 జోన్లకు పుణ్యక్షేత్రాల పేర్లను సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. 

అవి: జోన్ 1: కాళేశ్వరం, జోన్ 2: బాసర, జోన్ 3: రాజన్న, జోన్ 4: భద్రాద్రి, జోన్ 5: యాదాద్రి, జోన్ 6: ఛార్మినార్, జోన్ 7: జోగుళాంబ. 

మల్టీ జోన్స్: 

ఉత్తర తెలంగాణా జిల్లాలలోని కాళేశ్వరం,  బాసర, రాజన్న, భద్రాద్రి జోన్స్ మల్టీ జోన్ 1 క్రిందకు వస్తాయి. 

 దక్షిణ తెలంగాణా జిల్లాలలోని యాదాద్రి, జోగుళాంబ, చార్మినార్ మల్టీ జోన్ 2 క్రిందకు వస్తాయి. 

కాళేశ్వరం (జోన్:1) పరిధిలో భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 28.29 లక్షలు.

బాసర (జోన్:2) పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 39.74 లక్షలు.

రాజన్న (జోన్: 3) పరిధిలో కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 43.09 లక్షలు.

భద్రాద్రి (జోన్: 4) పరిధిలో కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, వరంగల్ అర్భన్ జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 50.44 లక్షలు.

యాదాద్రి (జోన్:5) పరిధిలో సూర్యాపేట, నల్లగొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 45.23 లక్షలు.

ఛార్మినార్ (జోన్: 6) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వస్తాయి. వీటి మొత్తం జనాభా: 1.03 కోట్లు.

జోగుళాంబ (జోన్:7) పరిధిలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, వికారాబాద్ జిల్లాలు వస్తాయి. వీటి మొత్తం జనాభా: 44.63 లక్షలు.

ఈ ప్రతిపాదనపై నేడు ఉద్యోగ సంఘాల నేతలు టిజివో భవన్ లో చర్చించి ప్రభుత్వానికి తమ అభిప్రాయం తెలియజేస్తారు. వారి అభిప్రాయం తీసుకున్న తరువాత ప్రభుత్వం ఈ కొత్త జోన్స్ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతుంది.

Related Post