కాంగ్రెస్ లో చేరనున్న గద్దర్ కుమారుడు

April 25, 2018


img

ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు జివి సూర్యకిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు నాగం జనార్ధన్ రెడ్డి, ఆది శ్రీనివాస్ కూడా చేరబోతున్నారు. బుధవారం ఉదయం డిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 

తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తన స్వంత నిర్ణయమని దీనికి తన తండ్రి గద్దర్ కు ఎటువంటి సంబంధమూ లేదని సూర్యకిరణ్ చెప్పారు. వచ్చే ఎన్నికలలో అవకాశం లభిస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లేదా బెల్లంపల్లి లేదా జుక్కాల్ నియోజకవర్గాలలో ఏదో ఒక చోటనుంచి శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. Related Post