గులాబీ కూలీ లేనట్లే...థాంక్స్ రేవంతన్న

April 23, 2018


img

ప్రతీ ఏటా తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా ప్లీనరీ సమావేశాలు జరుపుకోవడం, వాటి నిర్వహణ కోసం తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు, తెరాస నేతలు అందరూ ‘గులాబీ కూలీ’ పేరిట రకరకాల పనులు చేసి నిమిషాల వ్యవధిలోనే వేలు...లక్షలు సంపాదించడం జరిగేది. అధికారంలో ఉన్నవారు తమ ప్లీనరీ సమావేశాల కోసం ప్రైవేట్ పరిశ్రమలు, విద్య, వైద్య, వాణిజ్య సంస్థల నుంచి ఈవిధంగా విరాళాలు వసూలు చేయడం సరికాదని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తెరాస పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వేసిన ఒక్క పిటిషన్ తో గులాబీ కూలి నిలిచిపోయింది. 

ఈ ‘గులాబీ కూలీ’ పేరిట బలవంతపు వసూళ్ళు చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, అవినీతి నిరోధ చట్టం 1988కు పూర్తి విరుద్దమని కనుక దానిని అడ్డుకొని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ రేవంత్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ లో డిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన డిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ హరిశంకర్ ఈ పిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లుగా ఆ చట్టఉల్లంఘనలు జరిగాయా లేదా తెలియజేయవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల కమీషనర్ కు ఒక లేఖ వ్రాశారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆ కేసులో మళ్ళీ కదలిక కనబడలేదు. కానీ ఆ పిటిషన్ ప్రభావం తెరాసకు అర్ధమైనట్లుంది. బహుశః అందుకే ఈ ఏడాది ప్లీనరీ సమావేశానికి ‘గులాబీ కూలి’ ఊసే ఎత్తడంలేదు. మరో నాలుగు రోజులలో కొంపల్లిలో ప్లీనరీ సమావేశం జరుగబోతోంది కనుక బహుశః ఇక గులాబీ కూలీ ఉండకపోవచ్చు. కనుక ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పవచ్చు. 


Related Post