తప్పదు...చేర్చుకోవాలి.. ఎవరూ అడ్డుచెపొద్దు

April 16, 2018


img

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నాగం జనార్ధన రెడ్డికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అయన వెయిటింగ్ లో ఉండగానే మరో భాజపా నేత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవడం విశేషం. వేములవాడకు చెందిన భాజపా నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏనుగు మనోహర్ రెడ్డి వర్గం అయన చేరికను వ్యతిరేకిస్తోంది. తమ రాజకీయ శత్రువైన అతనిని చేర్చుకొని తమకు ఇబ్బంది కలిగించవద్దని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మనోహర్ రెడ్డి కోరారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో పార్టీలో చేర్చుకొన్నా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని. పార్టీని బలోపేతం చేసుకోవడానికి బలమైన నేతల రాక చాలా అవసరమని కనుక ఆది శ్రీనివాస్ రాకను అడ్డుకోవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు విషయంలో తాను ఎవరికీ హామీలు ఇవ్వడం లేదని కనుక వాటి గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆది శ్రీనివాస్ విషయంలో ఇంత స్పష్టంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి నాగం జనార్ధన్ రెడ్డిని చేర్చుకొనే విషయంలో ఇంత నిఖచ్చిగా ఎందుకు మాట్లడలేకపోతున్నారో? 



Related Post