హెచ్.సి.యులో విద్యార్ధినిపై అత్యాచార ప్రయత్నం!

March 17, 2018


img

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్.సి.యు.) విద్యార్ధినిపై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచార ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చొని ఇద్దరు యూనివర్సిటీ విద్యార్ధులు కబుర్లు చెప్పుకొంటుండగా అటుగా వచ్చిన కొందరు యువకులు విద్యార్ధినితో ఉన్న యువకుడిపై దాడి చేసి ఆమెపై అత్యాచార ప్రయత్నం చేశారు. కానీ ఆమె స్నేహితుడు గట్టిగా ప్రతిఘటించడంతో వారు పారిపోయారు. ఈ సనగ్తి తెలుసుకొన్న గచ్చిబౌలి పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ విద్యార్ధిని, ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను గుర్తించడానికి ఆ యువతీయువకులిద్దరూ ఈరోజు ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఈ సంఘటనతో హెచ్.సి.యులో మళ్ళీ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.      



Related Post