హడావుడి నిర్ణయాలు...కోర్టు మొట్టికాయలు

March 17, 2018


img

తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేకసార్లు హడావుడిగా నిర్ణయాలు తీసుకొని అమలుచేసేయడం, దానిపై కోర్టులు మొట్టికాయలు వేసిన తరువాత వాటిని ఉపసంహరించుకోవడం జరుగుతూనే ఉంది. వివిధ తెలంగాణా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న సుమారు 1200 మంది ఉద్యోగులను మూడేళ్ళ క్రితం ఏపి స్థానికత పేరుతో విధులలో నుంచి తప్పించి (రిలీవ్) చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నానాకష్టాలు పడుతున్నారు. వారు ఏపి, తెలంగాణా ప్రభుత్వాలకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించుకొన్నారు. కానీ హమీలే తప్ప వారి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. వారిని ఏపి స్థానికత పేరుతో రిలీవ్ చేయడం సరికాదని అందరినీ మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిలో 484 మందికి తిరిగి ఉద్యోగాలలో తీసుకొంటు జెన్-కో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మిగిలినవారికి కూడా వారు ఇదివరకు పనిచేసిన విద్యుత్ సంస్థలలోనే తిరిగి ఉద్యోగాలు పొందబోతున్నారు.           



Related Post