కాచిగూడా స్టేషన్ లో జస్ట్ మిస్!

March 15, 2018


img

బుధవారం సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్ లో పెనుప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లింగంపల్లి నుంచి ఫలక్ నామాకు వెళ్ళే ఎంఎంటిఎస్ రైలు, సీతాఫల్ మండి నుంచి విద్యానగర్ వెళ్ళే వెళ్ళే ఎంఎంటిఎస్ రైలు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చేసాయి. అది చూసి ఆ రైళ్ళలో ప్రయాణికులు హడిలిపోయారు. కానీ ఎదురుగా నిలిచి ఉన్న రైలును చూసి రైల్ డ్రైవర్ తన రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 

సాధారణంగా లింగంపల్లి నుంచి ఫలక్ నామాకు వెళ్ళే ఎంఎంటిఎస్ రైలును రెండవ నెంబర్ ప్లాట్ ఫారం మీదుగా రాకపోకలు సాగిస్తుంటుంది. కానీ నిన్న సాయంత్రం ఆ ప్లాట్ ఫారం పై గుంటూరు ప్యాసింజర్ నిలిచి ఉండటంతో, ఎంఎంటిఎస్ రైలును విద్యానగర్ వైపు వెళ్ళే ట్రాక్ పై రెడ్ సిగ్నల్ వేసి నిలిపి ఉంచారు. అదే సమయంలో విద్యానగర్ నుంచి ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్ వైపు వచ్చింది. కానీ అదే ట్రాక్ పై ఎదురుగా మరో ఎంఎంటిఎస్ రైలును చూసిన డ్రైవర్ తన రైలును నిలిపివేశాడు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. దీనిపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.


Related Post