కోమటిరెడ్డి, సంపత్ నిరాహార దీక్ష

March 13, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ఇద్దరూ మంగళవారం సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద 48 గంటల నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. తమ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా వారు ఈ దీక్ష చేపట్టబోతున్నారు. ఇదే సమస్యపై కాంగ్రెస్ పార్టీ బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి కనీసం తమను వివరణ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొన్నారని సిఎల్పి నేత జానారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతించకపోవచ్చునని గత అనుభవాలు చెపుతున్నాయి. కనుక గాంధీ భవన్ వద్ద దీనిపై మరొకసారి కాంగ్రెస్ నేతలు హడావుడి చేసే అవకాశాలున్నాయి. Related Post