టిటిడికి హైకోర్టు బ్రేకులు

February 22, 2018


img

తిరుమల తిరుపతిలో అనేక ఏళ్ళుగా పనిచేస్తున్న 43 మంది అన్యమత ఉద్యోగులను విధులలో నుంచి తొలగించడానికి టిటిడి ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆ ఉద్యోగుల ప్రతినిధులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు తిరుమల దేవస్థానాలతో సహా రాష్ట్రంలో టిటిడి అధ్వర్యంలో నడుస్తున్న అన్ని దేవాలయాలలో, ఆసుపత్రులు, తదితర సంస్థలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టిటిడి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఆ ఉద్యోగులు సమాధానం ఇవ్వాలని కోరింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని మళ్ళీ మార్చి నెలలో విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపి దేవాదాయ శాఖ ప్రదానకార్యదర్శికి, టిటిడిఈవోకి హైకోర్టు నోటీసులు పంపించింది.



Related Post