కమల్ హాసన్ పార్టీ పేరు ఏమిటంటే..

February 21, 2018


img

ప్రముఖ నటుడు కమల్ హాసన్ బుధవారం సాయత్రం మదురైలో నిర్వహించిన బారీ బహిరంగ సభలో తన పార్టీ పేరును ప్రకటించి పార్టీ చిహ్నాన్ని ఆవిష్కరించారు. అయన స్థాపించిన పార్టీ పేరు ‘మక్కల్ నీతి మయ్యమ్’ (ప్రజా జస్టిస్ పార్టీ). ఇక పార్టీ చిహ్నంగా తెలుపు రంగు జెండాపై ఎరుపు, తెలుపు రంగులలో ఉన్న చేతులు ఒకదానినొకటి పట్టుకొని ఉండగా మధ్యలో తెల్లటి నక్షత్రం బొమ్మ ఉంది. ఎరుపు వామపక్ష భావజాలానికి సంకేతంగా, తెలుపు స్వచ్చతకు సంకేతంగా భావించాలేమో?

 ఈ సందర్భంగా కమల్ హాసన్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఆకాశంలో నుంచి ఒద్దిపడిన వ్యక్తిని కాను. తలైవాను కాను. మీలో నుంచి వచ్చిన ఒక సామాన్య వ్యక్తిని. ఒక సామాన్య ప్రజా సేవకుడిని. ఎల్లప్పుడూ మీ అందరికీ నేను జవాబుదారీగా ఉంటానని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

కమల్ పార్టీ ఆవిర్భావ సభకు డిల్లీ ముఖ్యమంత్రిఅరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈరోజు ఉదయం రామేశ్వరం వెళ్ళి అక్కడ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలుసుకొని మాట్లాడారు. అనంతరం కలాం సమాధివద్ద నివాళులు అర్పించి మదురై చేరుకొని పార్టీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్రం నలుమూలల నుంచి కమల్ హాసన్ అభిమానులు బారీగా తరలి వచ్చారు. రేపటి నుండి కమల్ హాసన్ పాదయాత్ర చేయబోతున్నారు.


Related Post