ఏపిలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

February 17, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు ఈరోజు. కనుక ఇవ్వాళ్ళ తెలంగాణా రాష్ట్రంలో తెరాస నేతలు, అయన అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకొంటున్నారు. దేశవిదేశాలలో కూడా తెరాస మద్దతుదారులు, కెసిఆర్ అభిమానులు ఉన్నారు కనుక వారు కూడా అయన పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నారు. అయితే ఇవేమీ పెద్ద విశేషం కావు. తాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన ఆంధ్రాలో కూడా అయనకు కొంతమంది అభిమానులు ఏర్పడటం, వారు కూడా అయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే విశేషం. గుంటూర్ జిల్లా తెనాలిలో కెసిఆర్ అభిమాన సంఘం కూడా ఉంది. దాని అధ్యక్షుడు ఖాదర్ నేతృత్వంలో కెసిఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరిపారు. తెలంగాణా సాధన కోసం అయన ఏవిధంగా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారో, అదేవిధంగా ఏపిలో నాయకులు కూడా ప్రత్యేకహోదా కోసం గట్టిగా పోరాడాలని ఖాదర్ కోరారు.  



Related Post