కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై!

February 14, 2018


img

రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న ప్రముఖ సినీ హీరో కమల్ హాసన్ తాను ఇకపై సినిమాలు చేయబోనని ప్రకటించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు కమల్ హాసన్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ఆలోచనలను వివరించారు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేస్తానని, రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత ఇక సినిమాలు చేయనని చెప్పారు. రాబోయే ఎన్నికలలో అన్ని స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడానికి వస్తున్న తనపై ప్రజలు నమ్మకముంచి తప్పకుండా గెలిపిస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోతే ప్రతిపక్ష స్థానంలో కూర్చొంటామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు కొత్తకావచ్చు కానీ గత మూడున్నర దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కారణంగా రాజకీయాలు తనకు కొత్తగా అనిపించడం లేదన్నారు. హిందూ అతివాదం వలన దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 21న పార్టీ పేరును, ఎన్నికల గుర్తు, అజెండాను ప్రకటించడానికి కమల్ హాసన్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు.



Related Post