మహేష్ కత్తిపై కోడిగుడ్లతో దాడి

January 19, 2018


img

సినీ విమర్శకుడు మహేష్ కత్తిపై గురువారం రాత్రి కోడిగుడ్లతో దాడి జరిగింది. అయన నిన్న రాత్రి ఒక టీవి ఛానల్ లో జరుగబోయే చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో వెళుతుండగా, కొండాపూర్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్ పై వచ్చి అతనిపై కోడిగుడ్లు విసిరారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు చేసినపనే అయ్యుంటుందని మహేష్ కత్తి అనుమానం వ్యక్తం చేశారు. తాను పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్న కారణంగానే అయన అభిమానులు తనను టార్గెట్ చేసుకొని బెదిరింపులకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మహేష్ కత్తి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తన అభిమానులను అదుపు చేయాలని కోరారు.Related Post