ప్రపంచంలో ఎత్తైన కట్టడాలలో ఒకటిగా నిలుస్తున్న దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా భవనంపై అమర్చిన ఎల్ఈడీ దీపాలతో సమయం సందర్భం బట్టి వివిద దేశాల జండాలు, దేశాధినేతల చిత్రాలను ఇంకా అనేకం ప్రదర్శిస్తుంటుంది. ఆగస్ట్ 14 అర్దరాత్రి పాకిస్తాన్‌కు స్వాతంత్రం వచ్చింది కనుక బూర్జ్ ఖలీఫా భవనం పాకిస్తాన్ జండాను ప్రదర్శిస్తారని ఆశతో అది చూసేందుకు వందలాదిమంది పాకిస్థానీ పౌరులు అక్కడకు చేరుకొని అర్దరాత్రి వరకు ఎదురుచూశారు. కానీ బూర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జండాని ప్రదర్శించకపోవడంతో పాకిస్తానీలు తీవ్ర నిరాశతో ఆగ్రహంతో అట్టుడికిపోయారు.
ఆగస్ట్ 15న భారతీయ జండాను ప్రదర్శిస్తున్నప్పుడు, పాకిస్తాన్ జండాను ప్రదర్శించడానికి ఏమిటి అభ్యంతరం?అయినా మా దేశం పరిస్థితి చూస్తే అందరికీ అలుసే... ఒక్కసారి మా జాతీయజండాను ప్రదర్శించవచ్చుగా...”అని తిట్టుకొన్నారు. బూర్జ్ ఖలీఫా భవనం ఎదుట పాకిస్తానీ పౌరులు చాలాసేపు నినాదాలు కూడా చేస్తూ తమ జండాను ప్రదర్శించాలని కోరారు. కానీ బూర్జ్ ఖలీఫా నిర్వాహకులు స్పందించలేదు.
వారు కోరినది పెద్ద కొరికేమీ కాదని అందరికీ తెలుసు. దానిని మన్నించి ఉంటే ఆ దేశాన్ని గౌరవించిన్నట్లు ఉండేది. కనీసం బూర్జ్ ఖలీఫా నిర్వాహకులు పాకిస్థానీ జండాను ఎందుకు ప్రదర్శించలేకపోతున్నామో చెప్పినా వారు అంతగా బాధపడి ఉండేవారు కారు. ఇది తమని తమ దేశాన్ని అవమానించడమే అని బాధపడుతూ అందరూ తిరిగి వెళ్ళిపోయారు.