మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది. దీనిలో మారుతి మార్క్ హర్రర్ చూపిస్తే, ప్రభాస్ తన మార్క్ కామెడీ చూపించారు. కల్కిలో ప్రభాస్ హీరోయిజంతో పాటు కామెడీ చేయగా, ఈ సినిమా హర్రర్-కామెడీ చేసి మెప్పించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్దమవుతుంది.
“ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రయాణం.. నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను..’ సంజయ్ దత్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలుపెట్టి, ఓ చీకటి గదిలో గజగజ వణికిపోతూ ఓ మూల కూర్చున్న ప్రభాస్ “తాత వైర్లు కొరికేశాడేమో చూడండ్రా బయట..” అనే డైలాగ్ విన్నప్పుడు అందరూ నవ్వుకోకుండా ఉండలేరు. అలాగే ప్రభాస్ రొమాన్స్, ఫైట్స్ వాటిలో ఆయన స్టైల్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, జారీనా వాహేబ్, సంజయ్ దత్, రిద్ధి కుమార్, మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, యోగి బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, జిషు సేన్ గుప్తా ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.