జైలర్-2 మొదలెట్టేశాము: రజినీకాంత్

September 25, 2025


img

కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్ర చేసిన జైలర్ సూపర్ హిట్ అవడంతో దానికి తప్పకుండా సీక్వెల్‌ ఉంటుందని అందరూ అనుకుంటున్నదే. అయితే సీక్వెల్‌ షూటింగ్ కూడా అప్పుడే మొదలుపెట్టేశామని రజనీకాంత్ స్వయంగా చెప్పడం విశేషం.

ఇటీవల కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ వద్ద జైలర్-2 షూటింగ్‌ జరిగింది. దానిలో పాల్గొన్నారు.  చెన్నై తిరిగివచ్చినప్పుడు విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు సీక్వెల్‌ గురించి అడిగితే ఇప్పుడు ఆ షూటింగ్‌ నుంచే తిరిగివస్తున్నానని చెప్పి రజనీకాంత్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

అంతేకాదు... జైలర్-2 వచ్చే ఏడాది జూన్ 12న విడుదలవుతుందని కూడా చెప్పేశారు. దీంతో రజనీ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 

నెల్సన్ దర్శకత్వంలో చేసిన ‘జైలర్’ 2023, ఆగస్ట్ 10న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దాని సీక్వెల్‌ వచ్చే ఏడాది ఇంచు మించు అదే సమయానికి విడుదల కాబోతోంది. అంటే రజనీకాంత్ ఈ వయసులో కూడా కేవలం మూడేళ్ళలో రెండు (జైలర్) సినిమాలు పూర్తి చేస్తున్నారన్న మాట!  


Related Post

సినిమా స‌మీక్ష