రష్మిక ‘ధామ’ ట్రైలర్‌ రేపే?

September 25, 2025


img

అందాల భామ రష్మికని అందరూ అందంగానే చూడాలనుకుంటారు. కానీ ఆమె మాత్రం భయానకమైన రూపంలో ఉండే పాత్రలు, సినిమాలు చేస్తూ అభిమానులను నొప్పిస్తున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ధామ’లో దెయ్యంగా నటించారు. ఈ సినిమాలో పరేష్ రావాల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రలు చేశారు. 

ఆదిత్య సర్పోద్దార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన, ఆయుష్మాన్ ఖురానా జంటగా చేశారు. ఇప్పటికే దీని టీజర్‌ విడుదల చేశారు. రేపు (శుక్రవారం) ట్రైలర్‌ విడుదల కాబోతున్నట్లు సమాచారం. దీపావళికి ధామ విడుదల కాబోతోంది. 

మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో ఇదివరకు వచ్చిన స్త్రీ (2018), భేడియా (2022), స్త్రీ-2 (2024) మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ సిరీస్‌లో 4వ సినిమాగా వస్తున్న ‘ధామ’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష