తమన్నా, వశిష్ట ప్రధాన పాత్రలలో నటించిన ఓదెల-2 సినిమా సక్సస్మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి పాత్రలో భయానకంగా నటించి మెప్పించిన వశిష్ట తమ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి సున్నితంగా చురకలువేశారు.
“దుష్టశక్తులు చెలరేగిపోయినప్పుడే దైవశక్తి ఏమిటో తెలుస్తుంది.అదేవిదంగా మా సినిమా గురించి నెగెటివ్ కామెంట్స్, రివ్యూలు ఇస్తున్నవారి వల్లనే మాసినిమాకు ఫ్రీ పబ్లిసిటీ లభించి ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి.ఆ దుష్ట శక్తుల నుంచి దేవుడే మా సినిమాని కాపాడుతున్నాడు.
మా సినిమా బాలేదని నెగెటివ్ రివ్యూలు వ్రాస్తే వ్రాసుకోండి కానీ దాని వలన మీకు ఏమైనా ప్రయోజనం కలుగుతోందా?అని ఆలోచించుకోండి. కొంత మందికి ఈవిధంగా నెగెటివ్‌గా వ్రాయడం వల్లనే పని దొరుకుతుంది లేకుంటే ఉండదనుకుంటే నిరభ్యంతరంగా వ్రాసుకోండి. మీకు ఆ విదంగా కూడా మా సినిమా ఉపయోగపడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తాము. నెగెటివ్ రివ్యూలు వ్రాసిన వారందరికీ థాంక్స్. కానీ వారికీ నేను చెప్పేది ఒకటే మనం ప్రేమ, మానవత్వం, మంచితనాన్ని నలుగురికి వ్యాపింపజేయాలి తప్ప చెడు కాదు,” అని అన్నారు.
నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లకు థాంక్స్#Odela2 pic.twitter.com/7bi9tV850S