వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ నుంచి ‘వేర్ ఎవర్ యూ గో..’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రమో విడుదలైంది. పూర్తిపాట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతోంది. కృష్ణకాంత్ వ్రాసిన ఈ రొమాంటిక్ పాటని జీవి ప్రకాష్ స్వరపరచగా అర్‌మాన్ మాలిక్ హుషారుగా పాడారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ని పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో నిర్మిస్తున్నారు.
రాబిన్ హుడ్ గత ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగనాడు విడుదల చేయాలనుకున్నారు. కానీ పుష్ప-2, గేమ్ చేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి నాలుగు పెద్ద సినిమాల ప్రభావం రాబిన్ హుడ్‌పై పడితే నష్టపోవలసి వస్తుందని మార్చి 28కి వాయిదా వేసుకున్నారు.