డాకూ మహరాజ్ కూడా అప్పుడే ఓటీటీలోకి రాలేడట!

February 11, 2025


img

ఈ సంక్రాంతికి విడుదలైన మూడు పెద్ద సినిమాలలో అతి పెద్దది గేమ్ చేంజర్‌ ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. దాని తర్వాత వరుసగా విడుదలైన డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఇంకా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా లేవు.

రెండు సినిమాలు ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో థియేటర్లలో నడుస్తున్నాయి కనుక మరికొన్ని రోజులు ఆగి ఓటీటీలోకి పంపించాలని వాటి నిర్మాతలు భావిస్తున్నారు. ఈసారి సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హక్కులు జీ5 పొందగా, డాకూ మహరాజ్‌ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మృణాళినీ ఠాకూర్ ప్రధాన పాత్రలలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించడంతో వారు దానిని ఆదరించడంతో సూపర్ హిట్ అయ్యింది. 

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ, ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలు చేసిన డాకూ మహరాజ్ మాస్ ఆడియన్స్‌ని అలరించడంతో వారు దానిని హిట్ చేశారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలో బాగానే ఆడుతోంది కనుక ఓటీటీలో విడుదల చేసేలోగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేయిస్తున్నారు. అవి పూర్తికాగానే ఒకేసారి 5 భాషలలొ విడుదల చేయాలని భావిస్తున్నారు. 

ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే లేదా కాస్త అటూ ఇటూగా విడుదలవుతాయని ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ రెండూ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న విడుదలయ్యే అవకాశం ఉంది.  


Related Post

సినిమా స‌మీక్ష