డిసెంబర్‌లోనే మా పెళ్ళి: కీర్తి సురేష్

November 29, 2024


img

కీర్తి సురేష్ తెలుగులో చాలా సినిమాలే చేశారు. కానీ అందరూ ఆమెను మహానటిగానే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు ఆ మహానటి పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. దుబాయ్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడిన ఆంటోనీతో గత 15 ఏళ్ళుగా ఆమె ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని తెలియజేస్తూ ఇటీవలే ఓ ఫోటో షేర్ చేశారు కూడా. 

శుక్రవారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

అనంతరం వారు బయటకు వచ్చినప్పుడు విలేఖరులు ఆమె పెళ్ళి గురించి అడుగగా, వచ్చే నెల (డిసెంబర్‌)లోనే తాము గోవాలో వివాహం చేసుకోబోతున్నామని, దాని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తాను నటించిన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ త్వరలో విడుదల కాబోతోందని, అందుకే స్వామివారిని దర్శించుకున్నానని కీర్తి సురేష్ చెప్పారు. సూపర్ హిట్ తమిళ సినిమా ‘తెరీ’కి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష