మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో చేస్తున్న ‘విశ్వంభర’ సినిమా టీజర్ దసరా పండుగ సందర్భంగా నేడు విడుదల చేశారు. చిరంజీవి మళ్ళీ చాలా కాలం తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్‌కి బింబిసార వంటి సూపర్ హిట్ అందించిన మల్లాది వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తునందున ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. కొద్ది సేపటి క్రితం విడుదలైన టీజర్ అందుకు తగ్గట్లే ఉంది.
భూమండలం మీద దుష్టశక్తులు ఉద్భవించి వినాశనం సృష్టిస్తుంటే వాటిని మన దొరబాబు ఏవిదంగా అడ్డుకొని మట్టుబెడతాడనేది ఈ సినిమా స్టోరీ అని టీజర్ చెపుతోంది. కనుక విశ్వంభరలో అద్భుతమైన గ్రాఫిక్స్, మంచి యాక్షన్ సన్నివేశాలకు చాలా అవకాశం ఉంటుంది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, పాటలు: శ్రీ శివశక్తి దత్త, చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, సంతోష్ కామిరెడ్డి అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10న విడుదల కావలసి ఉంది. కానీ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20కి బదులు ఆలస్యమై జనవరికి మారితే, విశ్వంభర మార్చికి వాయిదా పడే అవకాశం ఉంది.