నరుడి బ్రతుకు నటన ట్రైలర్‌ విడుదల

October 12, 2024


img

పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు దేనిదారి దానిదే అన్నట్లు పోటాపోటీగా విడుదలవుతూనే ఉంటాయి. పెద్ద సినిమా హిట్ అవకపోతే లోకమంతా టాంటాం అయిపోతుంది. కానీ చిన్న సినిమాలకు ఆ బాధ లేదు బాగుంటే లోకమంతా టాంటాం అవుతాయి లేకుంటే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో ఎవరికీ తెలీదు. ఓటిటీలు అందుబాటులోకి వచ్చాక చిన్న సినిమాల సంఖ్య చాలా పెరిగింది. 

తాజాగా ఋషికేశ్వర్ యోగి దర్శకత్వంలో నరుడి బ్రతుకు నటన అనే ఓ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో శివకుమార్, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్‌, వివ రాఘవ, దయానంద్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే సినిమాలో ఏదో కొత్త విషయం చెప్పబోతున్నట్లు అనిపిస్తుంది. 

ఈ సినిమాకి కధ, ఎడిటింగ్, దర్శకత్వం: ఋషికేశ్వర్ యోగి, సంగీతం: ఎన్‌వైఎక్స్ లోపెజ్, పాటలు: చిట్రన్, ఆదర్శ్ కుమార్‌ అనియల్ అందించారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డాక్టర్ సింధూరెడ్డి కలిసి ఈ సినిమా నిర్మించారు.        



Related Post

సినిమా స‌మీక్ష