నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి ఎడి2898 సినిమా నుంచి భైరవ్ యాంథమ్ సాంగ్ విడుదల కాస్త ఆలస్యమైన్నప్పటికీ ‘తెలుగు-పంజాబీ మిక్స్’లో వెరైటీగా ఉంది.
ఈ పాటలో పంజాబీ లిరిక్స్ తెలుగు ప్రేక్షకులలో చాలా మందికి అర్ధం కాకపోవచ్చు. కానీ అదే బాణిలో కొన్ని చరణాలు తెలుగులో ఉండటం వలన పాటని అందరూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ పాటలో ప్రభాస్ నల్ల దుస్తులలో పంజాబీ స్టైల్లో చూపించడం బాగుంది. ప్రభాస్ అభిమానులు చాలా సంతోషిస్తారు.
ఈ పాటలో తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి, కుమార్ వ్రాయగా, ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిట్ దోసన్హ్ పంజాబీ లిరిక్స్ వ్రాసి పంజాబీ స్టైల్లో ఆడి పాడారు. ఈ పాటకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించడమే కాక తెలుగు లిరిక్స్ స్వయంగా పాడారు.
ఈ సినిమాలో దీపికా పడుకొనే, దిశా పటానీ, హీరోయిన్లుగా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. కల్కి ఎడి2898 జూన్ 27వ తేదీన విడుదల కాబోతోంది. ఇది కూడా పుష్ప-2 సినిమాలా మళ్ళీ వాయిదా పడదనే ఆశిద్దాం.