సంపూర్ణేష్ బాబు ఆ మద్య వరుసపెట్టి కొన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు కానీ తర్వాత హటాత్తుగా మాయం అయిపోయారు. మళ్ళీ చాలాకాలం తర్వాత సూపర్ హిట్ తమిళ సినిమా మండేలా తెలుగు రీమేక్ ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సంపూర్ణేష్ బాబు నెత్తిమీద కిరీటం, దానిలో రాజకీయ నాయకులు, జెండాలు, తోరణాలు, ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే స్పీకర్ బాక్సులు, డప్పుగుర్తు వగైరాలు చూపారు. వర్తమాన రాజకీయాలను వ్యంగ్యంగా చూపుతూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాతో పూజ అపర్ణా కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకొన్న వెంకటేష్ మహా ఈ సినిమాలో క్రియేటివ్ ప్రొడ్యూసర్.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర కలిసి ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్ 27న ఈ సినిమా విడుదల కాబోతోంది.