హైదరాబాద్‌లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు

October 21, 2026


img

దసరా నవరాత్రులు ముగియడంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వేలాది దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల కార్యక్రమం జరుగుతోంది. బుధవారం (అక్టోబర్ 21) మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్‌లోని, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో రేపు దుర్గామాత విగ్రహాల నిమజ్జనం జరగనుంది. 

ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, సచివాలయం, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళిస్తారు. 

పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. 

నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద రవీంద్రభారతి, మాసాబ్‌ట్యాంక్ వైపు పంపిస్తారు. 

ఇక్బాల్ మినార్ నుంచి సచివాలయం వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.

అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి సచివాలయం వైపు వచ్చే వాహనాలను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి సచివాలయం వైపు వెళ్లే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు పంపిస్తారు.

అలాగే నల్లగుట్ట ఎక్స్ రోడ్స్, మినిస్టర్ రోడ్, రాణిగంజ్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. కనుక వాహనదారులు ఇందుకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకుని బయలుదేరాలని నగర ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. 


Related Post