యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ఓ వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య వాదోపవాదాలు జరుగుతుండగా, మరో పక్క దానిలో 5వ యూనిట్‌ను జాతీయ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ 5వ యూనిట్ జాతీయ గ్రిడ్‌తో అనుసంధాన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లోని ఐదు యూనిట్లూ గ్రిడ్‌కు అనుసంధానమైనట్లయింది.
ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు రూ.20,400 కోట్ల విలువైన ప్రధాన నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్ చేపట్టింది. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ కొరత ఏర్పడిన ఈ సమయంలో యాదాద్రిలోని ఈ ఐదో యూనిట్ కూడా అందుబాటులోకి రావడం చాలా ఉపశమనం కలిగించేదే.
అయితే, ఈ యూనిట్ గ్రిడ్‌కు అనుసంధానమైన తర్వాత పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైన విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ధృవీకరించుకునేందుకు వరుసగా అనేక పరీక్షలు, తర్వాత కొన్ని సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విద్యుత్ తెలంగాణకు అందుబాటులోకి వస్తుంది. వీటికి కనీసం 15-30 రోజులు సమయం పట్టవచ్చని తెలుస్తోంది.