ఈరోజు టీవీ5లో కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ!

July 02, 2025


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈరోజు సాయంత్రం 7 గంటలకు ‘సిఎం టార్గెట్’ పేరుతో పోడ్ కాస్ట్ ద్వారా కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు టీవీ5 న్యూస్ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. 

“ట్యాపింగ్ జరిగిందా?దయ్యం ఎవరు?జాగృతి ప్లానెంటీ?అలాగే ఎన్నో రహస్యాలు!” అంటూ ఆమె ఇంటర్వ్యూ దేని గురించో  టీవీ5 ఎక్స్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలతోనే రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఈరోజు ఇంటర్వ్యూలో ఇంకెన్ని బాంబులు పేలుస్తారో.. ఏమో?     


Related Post