నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షురూ

June 28, 2025
img

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల కొరకు శనివారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా మూడు విడతలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోనందున ప్రస్తుతానికి పాత ఫీజుల ప్రకారమే ఏడాదికి రూ.1.65 లక్షలు చొప్పున పరిగణిస్తూ ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని, త్వరలోనే ఫీజుల విషయమై ప్రకటిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. 

Related Post