సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటడ్ (టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్.) సంస్థలో అకౌంట్స్ ఆఫీసర్స్, ఎలెక్ట్రికల్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిలో అసిస్టెంట్ ఇంజనీర్ :153 పోస్టులు భర్తీ చేయబడతాయి. వీటిలో ఎలక్ట్రికల్ విభాగంలో 133 (అసిస్టెంట్ ఇంజనీర్) పోస్టులు, సివిల్ విభాగంలో మిగిలిన 20 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇవికాక జూనియర్ అకౌంటెంట్: 114 పోస్టులు కూడా భర్తీ చేయబడతాయి.
వీటికి దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్ధులు నేటి నుంచే తగిన ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకొని దరఖాస్తులు పొందవచ్చు. రేపటి నుంచి ఈ నెల 19వ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఉంటుంది.