ఈ కామర్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తుండటంతో వాటి మద్య విపరీతమైన పోటీ పెరిగి కొత్త కొత్త వ్యాపారాలలోకి దిగుతున్నాయి. ఇప్పటికే స్విగ్గీ, బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలు కూరగాయాలతో సహా నిత్యావసర సరుకులు ఇంటికి తెచ్చి అందిస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ పేరుతో కూరగాయల డోర్ డెలివరీ బిజినెస్‌లోకి ప్రవేశించింది.
ఈ విషయం తెలియజేస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిరుపేద ప్రజలు కూడా కేవలం రూ.9లకే కేవలం 10 నిమిషాలలో కూరగాయలు పొందవచ్చని తెలియజేస్తూ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.
Mrs.Rastogi orders only from Flipkart Minutes. Why?
— Flipkart Minutes (@Flipkartminutes) May 31, 2025
Because the freshest veggies arrive in just 10 minutes—at just ₹9!#VeggiesAt9