సమ్మర్ హాలీడేస్ అంటే ఇది స్కూళ్ళ సెలవుల గురించి వార్త కాదు. ‘సమ్మర్ హాలీడేస్’ అనే సినిమా గురించి.
శ్రీకర్ దర్శకత్వంలో మాస్టర్ రోహాన్ రాయ్, మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రలు చేస్తున్న సినిమా ‘సమ్మర్ హాలీడేస్,’ ప్రతి మనిషి జీవితంలో బాల్యం, సమ్మర్ హాలీడేస్ జ్ఞాపకాలు చాలా మధురానుభూతులు. దర్శకుడు తన బాల్యంలోని అనుభూతులని జోడించి ఈ సమ్మర్ హాలీడేస్ కధ సిద్ధం చేసుకున్నారు.
మాస్టర్ రోహాన్ రాయ్, మాస్టర్ అరుణ్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల మనసులలో ఎప్పుడో స్థానం సంపాదించుకున్నారు. మాస్టర్ రోహాన్ రాయ్ 90’ మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలలో నటించి మెప్పించాడు. మాస్టర్ అరుణ్ ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు.
వారిద్దరూ ఈ సినిమాలో బాల్య స్నేహితులుగా సమ్మర్ హాలీడేస్ ఎలా ఎంజాయ్ చేశారో దర్శకుడు శ్రీకర్ చూపించబోతున్నారు.
ఇది పిల్లల సినిమా కానీ పెద్దవారి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మా సమ్మర్ హాలీడేస్ అని నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పారు. తన మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సమ్మర్ హాలీడేస్ మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.