పుష్ప-2 నుంచి మొదటి పాట ప్రమో

April 24, 2024


img

అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ సినిమా కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ప్రమో బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 

అయితే 19 సెకన్లు నిడివి గల ఈ ప్రమో సాంగ్‌ మొత్తం పుష్పా, పుష్పా, పుష్పా, పుష్పా అంటూ సాగడంతో కాస్త నిరాశ కలిగిస్తుంది. కానీ పాటలో ఇది 19 సెకన్ల చిన్న భాగమే కనుక పూర్తి పాట వినకుండా అప్పుడే పాట గురించి తక్కువ అంచనా వేయడం సరికాదు.

పుష్ప మొదటి భాగంలో చాలా క్యాచీ బాణీలతో దేవిశ్రీ ప్రసాద్ అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. కనుక పుష్ప-2లో అంతకంటే తగ్గేదేలే అని అనుకోవచ్చు. పుష్ప-2లోని మొదటి పాట మే 1వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.  



Related Post

సినిమా స‌మీక్ష