ఉన్నది ఒకటే జిందగి రివ్యూ & రేటింగ్

October 27, 2017
img

రేటింగ్ : 3/5

కథ :

చిన్నప్పుడే అభి (రామ్) తల్లి చనిపోగా ఆ టైంలో తనకి తోడుగా నిలుస్తాడు వాసు (శ్రీవిష్ణు). ఇద్దరు ప్రాణ స్నేహితులుగా పెరుగుతారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి వాసు ప్రాజెక్ట్ పని మీద ఢిల్లి వెళ్లగా అభి తనకు నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ తో ఈవెంట్ ప్రెపరేషన్ లో ఉంటాడు. ఇక ఇలాంటి టైంలోనే మహా (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. అభి మహా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇక ఈ విషయం చెప్పేలోగా వాసు వాళ్ల మామయ్య కూతురే మహా అని తెలుస్తుంది. అంతేకాదు వాసు కూడా ఆమెను ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది. అభి, మహా ఇద్దరు మహాకే చాయిస్ వదిలేస్తారు. ఇంతకీ మహా ఎవరిని ఓకే చేసింది..? అభి, వాసుల స్నేహం అలానే ఉందా..? చివరకు ఏమైంది అన్నది అసలు కథ.

విశ్లేషణ :

నేను శైలజతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మళ్లీ ఉన్నది ఒకటే జిందగితో వచ్చారు. రామ్ కు ఎలాంటి సినిమా అయితే బాగుంటాయో అలాంటి కథ కథనాలతో సినిమా వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు సినిమా అంతా స్నేహానికి ప్రాధాన్య ఇస్తూ వచ్చే డైలాగ్స్ బాగా అనిపిస్తాయి. యూత్ కు నచ్చే ప్రేమ, స్నేహం రెండు అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అందుకే యూత్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. 

ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా అభి, మహాల లవ్ ట్రాక్ తో నడుపగా సెకండ్ హాఫ్ ఫ్రెండ్ షిప్ బేస్ మీద నడుస్తుంది. సిహ్నిమాలో డైలాగులతో మనసులను గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఫీల్ బాగుంటుంది. స్నేహం దాని ప్రాధాన్యత మీద వచ్చే డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి.

ఇక ఊహించిన క్లైమాక్స్ అనిపించినా అది న్యాయం చేస్తుంది. సినిమా మొత్తం కేవలం హీరోనే అన్నట్టు కాకుండా సపోర్టింగ్ రోల్ చేసిన శ్రీవిష్ణు పాత్ర కూడా ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఫీల్ గుడ్ మూవీగా సినిమా వచ్చింది. ఈతరం యువతకు మెచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

నటన, సాంకేతిక వర్గం :

ఎనర్జిటిక్ స్టార్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమాలో రాక్ స్టార్ గెటప్ లో రామ్ అదరగొట్టాడు. అనుపమతో లవ్ ట్రాక్ బాగుంది. సినిమా అంతా రామ్ ఎనర్జీ బాగుంది. ఇక శ్రీవిష్ణు కూడా సినిమాలో హీరోతో సమానమైన పాత్రలో కనిపించాడు. అనుపమ ప్రేక్షకుల మనసులను గెలుచుకోగా లావణూ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇక ఫ్రెండ్ క్యారక్టర్స్ కూడా ఇంప్రెస్ చేశాయి.  

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. నేను శైలజ మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేస్తూ రామ్ నుండి ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో అలాంటి సినిమానే తీశాడు కిశోర్ తిరుమల. స్నేహం, ప్రేమ కథలతో ఎన్నో సినిమాలు రాగా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. కెమెరామన్ సమీర్ రెడ్డి పనితనం బాగుంది. స్క్రీన్ ప్లే ఓకే. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ దేవి బాగా హెల్ప్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు బలం.

ఒక్కమాటలో :

నేను శైలజ కాంబినేషన్ ఈసారి లెక్క తప్పలేదు. ఉన్నది ఒకటే జిందగి ప్రేమ, స్నేహం యువతకు మనసు గెలిచే సినిమా..!


Related Post