నాటునాటుగా ఐపిఎల్ హంగామా షురూ

March 31, 2023
img

క్రికెట్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపిఎల్ సీజన్‌కి 16 హంగామా శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చాలా అట్టహాసంగా మొదలైపోయింది. ఈ వేడుకలను కూడా ఆస్కార్ అవార్డు సాధించిన నాటునాటు తెలుగుపాటతోనే ప్రారంభించడం విశేషం. తర్వాత పుష్పలో శ్రీవల్లీ, నా సామి నాసామి..., ఊ అంతవా మావ ఉఊ అంటావా మావా పాటలకు తమన్నా, రష్మిక మందనలు ఇద్దరూ తమ డ్యాన్సులతో ఐపిఎల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్‌ తన పాటలతో అందరినీ ఆకట్టుకొన్నాడు. నేడు తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మద్య జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలుచుకొని బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. 

కాన్వే (1), మోయిన్ అలీ (23),  బెన్ స్తోక్స్ (7) అవుట్ కాగా, ప్రస్తుతం ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ (57), అంబటి రాయుడు (3) క్రీజులో ఉన్నారు. రుతురాజ్ మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు తీసింది.

Related Post