కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ షూటింగ్‌ షురూ

May 09, 2025


img

 ‘క’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కిరణ్ అబ్బవరం సినిమా అనగానే వివరాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. దాని తర్వాత జైన్స్ నాని అనే  కొత్త దర్శకుడితో ‘కె-ర్యాంప్’ అనే సినిమా మొదలుపెట్టారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలైందని తెలియజేస్తూ ఓ పోస్టర్ వేశారు. సముద్రం ఒడ్డున నిలబడి ఎటో చూస్తున్న పోస్టర్ చలా బాగుంది. 

ఈ  సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించబోతోంది. వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేస్తున్నారు. 

హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. త్వరలోనే ఫస్ట్-లుక్‌ పోస్టర్ విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష