శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డ్యూటీలకు వెళ్ళివచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కనుక రాత్రి వేళల్లో ప్రయాణించే వారి సౌలభ్యం కోసం టిఎస్ ఆర్టీసీ ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 1 నుంచి నగరంలో ఆరు మార్గాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ బస్ సర్వీసులు అందుబాటులోకి తెబోతోంది.
రూట్ నంబర్ 222ఏ: (కోఠి నుంచి పటాన్‌చెరు) అబిడ్స్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, ఉస్మానియా యూనివర్సిటీ, గుట్టల బేగంపేట్, కొండాపూర్, కోకాపేట్ మీదుగా ఈ సర్వీసులు కొనసాగుతాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
రూట్ నంబర్ 218: (అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్‌చెరు) సీబీఎస్, కోఠి, లక్డీకాపూల్, పంజాగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా బస్సులు నడుస్తాయి. ప్రతి గంటా 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది.
రూట్ నంబర్ 219: (సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు) ప్యారడైజ్, ట్యాంక్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా ఈ సర్వీసులు కొనసాగుతాయి. ప్రతి గంటా 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది.
రూట్ నంబర్ 290యూ: (హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్) వనస్థలిపురం, ఎల్‌బీనగర్, నాగోల్, ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, రసూల్‌పురా, జేబీఎస్ మీదుగా బస్సులు నడుస్తాయి. ప్రతి గంటా 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది.
రూట్ నంబర్ 195డబ్ల్యూ: (బాచుపల్లి నుంచి వేవ్‌రాక్) విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ క్యాంపస్, జేఎన్‌టీయూ, బయోలాజికల్ సిటీ, ఈఎస్‌ఐసీ, ఇంద్రానగర్ ప్రాంతాలను ఈ సర్వీసులు కలుపుతాయి. ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
రూట్ నంబర్ 10హెచ్: (కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ పోలీస్ లైన్స్) ఆర్జే కాలేజీ తదితర ప్రాంతాల మీదుగా బస్సులు ప్రయాణిస్తాయి. ప్రతి 50 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుంది.