హైదరాబాద్‌లో వాన పడితే అది కూడా వార్తేనా? అనిపించవచ్చు. నిజమే! కానీ హైదరాబాద్‌లో వాన మొదలైతే నగర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతుంటారో తెలిసినవారు ‘అమ్మో వాన’ అని అనుకోకుండా ఉండలేరు.
నైరుతీ రుతుపవానాల ప్రభావంతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో ఈరోజు మధ్యాహ్నం నుంచే చిన్నగా వాన మొదలైంది. నేటి నుంచి జూలై 2 వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈరోజు మధ్యాహ్నం నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్, జనగామ, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు మొదలై రాత్రికి కాస్త ఉదృతంగా మారవచ్చని తెలిపింది.
ఆ తర్వాత సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వానలు విస్తరిస్తాయని తెలియజేసింది. కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.