అమెరిక-ఇరాన్ యుద్ధం మొదలైన కొద్ది రోజులకే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడటమే కాక గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ.993 చొప్పున పెంచేశాయి. పెంచిన ధర తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించాయి. గృహ వినియోగ సిలిండర్ ధర మాత్రం పెంచడం లేదని ప్రకటించాయి.
రెండు నెలల క్రితం మొదలైన అమెరిక-ఇరాన్ యుద్ధం నేటికీ ముగియలేదు. వాటి మద్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీసి లొంగదీసుకునేందుకు అమెరికా యుద్ధ నౌకలు హోర్మూజ్ జలసంధి వద్ద చమురు, గ్యాస్ తీసుకు వెళుతున్న నౌకలను అడ్డుకుంటూనే ఉన్నాయి. కనుక గ్యాస్ కొరత నానాటికీ పెరుగుతూనే ఉంది. దీని వలన దేశవ్యాప్తంగా హోటల్స్‌లో, బేకరీలు, స్వీట్ షాప్స్, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్ మూతపడుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ధర ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయలు పెంచడంతో ఎవరూ వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పెంపుతో గ్యాస్ అవసరమైన చిన్నా, పెద్ద పరిశ్రమలు కూడా మూతపడే ప్రమాదం కనిపిస్తోంది.