ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య రెడ్డి వివాహం

April 30, 2026


img

తెలుగు సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌-కావ్య రెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమల కొండపై కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఇరు కుటుంబాల బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులని ఆశీర్వదించారు. 

బెల్లంకొండ శ్రీనివాస్‌ గత ఏడాది ‘కిష్కిందాపురి’తో హిట్ కొట్టారు. ప్రస్తుతం దర్శకత్వంలో సాగర్ చంద్ర టైసన్ నాయుడు, లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ సినిమాలలో నటిస్తున్నారు.  

టైసన్ నాయుడులో బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా నభా నతేష్ నటిస్తుండగా, హైందవలో సంయుక్త జంటగా నటిస్తున్నారు.


Related Post