హైదరాబాద్‌లో సీబీఐ డైరెక్టర్.. అందుకేనా?

September 06, 2025


img

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన శ్రీశైలం వెళ్ళి మల్లిఖార్జునస్వామిని దర్శించుకొని శుక్రవారం తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా దారిలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీబీఐ అధికారులు వెంటనే ఆయనని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది కానీ ఇంకా  హాస్పిటల్లో ఉన్నందున ఈరోజు పోలీస్ అకాడమీలో సీబీఐ అధికారులతో జరగాల్సిన సమావేశం రద్దయింది. అయన కోలుకున్న తర్వాత సమావేశంలో పాల్గొని ఢిల్లీ బయలుదేరుతారని సమాచారం. 

కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర హోంశాఖకు ఓ లేఖ వ్రాసింది. కనుక అయన శ్రీశైలం నుంచి తిరిగి వెళుతూ దాని గురించి చర్చించేందుకే హైదరాబాద్‌ వచ్చారా లేదా వేరేదైనా కేసుల గురించి మాట్లాడేందుకు వచ్చారా?అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఒకవేళ కాళేశ్వరం కేసు కోసమే అయితే, ఆయన రాక బీఆర్ఎస్‌ పార్టీకి చాలా ఆందోళన కలిగించే విషయమే!


Related Post