లండన్ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ తిరిగివచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుకు శంషాబాద్ విమానాశ్రయంలోనే మీడియాటో మాట్లాడారు.. అని అనేకంటే ఆయన కోసం ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులు మాట్లాడించారని చెప్పుకోవచ్చు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్దత అందరికీ తెలుసు. నా గురించి నేను కొత్తగా వివరించుకోనవసరం లేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నాపై, బీఆర్ఎస్ పార్టీపై కొందరు ఆరోపణలు చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాష్ట్రంలో ప్రతీ వ్యవస్థని సమర్ధంగా తీర్చిదిద్దారు. అలాంటి ప్రతీ వ్యవస్థని ధ్వంసం చేస్తుంటే వారిని ప్రశ్నించకపోగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు చేశారో? ఎవరికి లబ్ధి కలిగించడానికి చేశారో వారికే తెలుసు. నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చి వారి ఆకాంక్షలు నెరవేర్చడమే మా కర్తవ్యం,” అని హరీష్ రావు చాలా హుందాగా కల్వకుంట్ల కవిత విమర్శలకు జవాబిచ్చారు.