చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డితో సహా ఆరురుగు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 20 మందిని గుర్తించామని వారి కోసం గాలిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, కొప్పూరుకి చెందిన వీరరాఘవ రెడ్డి 2022 లో రామరాజ్యం పేరుతో ఓ సంస్థని స్థాపించి, తన ఆర్మీలో చేరే యువకులకు నెలకు రూ.20,000 జీతం ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నాడని తెలిపారు.
నిరుద్యోగ యువత ఆ జీతం చూసి ఆశపడి రామరాజ్యంలో చేరుతున్నారని చెప్పారు. వారిలో చాలా మంది నిరు పేదలున్నారని, వారి నుంచి కూడా యూనిఫారం కొరకు అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2-3,000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈవిదంగా ఓ ముఠా ఏర్పరచుకొని వారితో ఈవిదంగా భయపెట్టి, దాడులు చేస్తూ డబ్బు దండుకుంటున్నాడని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
రంగరాజన్‌పై దాడి విషయం సిఎం రేవంత్ రెడ్డికి తెలియడంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే కాకుండా దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖని పంపించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు వెంటనే పోలీసులు రంగంలో దిగి రంగరాజన్‌పై దాడి చేసిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంకా పలువురు నేతలు వచ్చి రంగరాజన్‌ని పరామర్శించి ధైర్యం చెప్పారు.