ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

September 18, 2025
img

తెలంగాణ ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ (మెకానిక్) పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో మాత్రమే www.tgprb.in వెబ్‌సైట్‌కి దరఖాస్తులు సమర్పించవచ్చు. 

ఆర్టీసీలో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకి అప్పగించడం వలన టిజిపిఆర్‌బీ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

అర్హతలు: 

1. డ్రైవర్స్: వయసు 22-35 ఏళ్ళ లోపు. శ్రామిక్: 18-30 ఏళ్ళ లోపు. (ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు అదనంగా మరో 5 సంవత్సరాలు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌కు అదనంగా మరో 3 ఏళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది.    

2.  డ్రైవర్స్:  కనీస విద్యార్హత: 10వ తరగతి పాస్ అయ్యుండాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి కనీసం 18 నెలలు హెవీ ప్యాసింజర్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

3. శ్రామిక్: ఐటిఐ పాస్ అయ్యుండాలి. 

ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ ఫిట్‌నెస్, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ద్వారా డ్రైవర్లను ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా శ్రామిక్స్‌ను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: 

డ్రైవర్ పోస్టులకు ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు రూ.200, ఇతరులకు రూ.600. 

శ్రామిక్ పోస్టులకు ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు రూ.200, ఇతరులకు రూ.400.   

జీత భత్యాలు:  డ్రైవర్ల పే స్కేల్ : రూ. 20,960-60,080, శ్రామిక్స్ పే స్కేల్: రూ. 16,550-45,030.


Related Post