పది రోజులలో గ్రూప్-1 ఫలితాలు!

February 07, 2025
img

గ్రూప్-1 పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులకు శుభవార్త! మరో 10 రోజులలో గ్రూప్-1 పరీక్షా ఫలితాలు వెలువడనున్నాయి. గ్రూప్-1లో 563 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా మొత్తం 21,093 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయబోతోంది. ఈ లెక్కన 563 పోస్టులలో ఒక్కో పోస్టుకి 38 మంది చొప్పున పోటీ పడుతున్నట్లవుతుంది.

ఫలితాలు ప్రకటించిన తర్వాత, మార్కుల విషయంలో అభ్యర్ధులకు ఏవైనా అనుమానాలుంటే రీకౌంటింగ్ కోసం 15 రోజులు గడువు ఇవ్వనుంది. ఒక్కో పేపర్ రీకౌంటింగ్ కొరకు అభ్యర్ధులు రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత వెంటనే అభ్యర్ధుల సర్టిఫికెట్స్ పరిశీలించి అపాయింట్‌మెంట్‌ లెటర్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రూప్-1 అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రూప్-2,3 పరీక్షా ఫలితాలు ప్రకటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించిన్నట్లు సమాచారం.

Related Post