గ్రూప్-3 పరీక్షల పూర్తి షెడ్యూల్ జారీ

October 30, 2024
img

టీజీపీఎస్‌ఎస్సీ నేడు గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షల పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 17,18 తేదీలలో ఈ పరీక్షలు జరుగబోతున్నాయి. నవంబర్ 10వ తేదీన హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. రెండు సెషన్స్‌లో పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా లోనికి అనుమతిస్తారు.

ముఖ్య గమనిక: పరీక్షకు అర్ధగంట ముందు పరీక్షా కేంద్రాలు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్తులలో ఎవరినీ లోనికి అనుమతించరు. కనుక ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులు ఈవిషయం గుర్తుంచుకొని గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిది. 

ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్ధులు అందరూ తమ హాల్ టికెట్స్, ప్రశ్నా పత్రాలను జాగ్రత్తగా భద్రపరిచి ఉంచుకోవాలని టీజీపీఎస్‌ఎస్సీ సూచించింది. ఆ తర్వాత ఎట్టి పరిస్తితులలో డూప్లికేట్ హాల్ టికెట్స్ జారీ చేయబోమని ప్రకటించింది. గ్రూప్-3లో మొత్తం 1,380 పోస్టులు ఖాళీ ఉండగా మొత్తం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.      

Related Post