ఉపాధ్యాయుల పదోన్నతులలో అంతా గందరగోళమే

June 19, 2024
img

రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతోకాలంగా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి వాటికి సంబందించి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ పదోన్నతుల జాబితాలో అనేక తప్పులు దొర్లడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంగా ఉన్నారు.

మరోపక్క ఈ ప్రక్రియపై హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌గా శ్రీదేవసేనని న్యాయస్థానానికి పిలిపించి మరీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. 

ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్)ని పరిగణనలోకి తీసుకోకుండా పదోన్నతులు చేపట్టడంపై అభ్యంతరం చెపుతూ 150 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో ఇదివరకే పిటిషన్‌ వేశారు. దానిపై సింగిల్ జడ్జ్ విచారణ జరుపుతున్నారు.

ఆ కేసు పెండింగులో ఉండగా ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు ఏవిదంగా చేపడుతుందని హైకోర్టు పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌గా శ్రీదేవసేనని నిలదీసింది. తక్షణమే ఈ ప్రక్రియని ఉపసంహరించుకోవాలని లేకుంటే దీనిని కోర్టు ధిక్కారంగానే పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. 

దీంతో పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియని నిలిపివేసి హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత మళ్ళీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పటికే పంపిన జాబితాలలో దొర్లిన తప్పులను గుర్తించి తెలియజేయాలని ఆదేశించింది. 

Related Post