హైదరాబాద్‌లో 63 అంతస్తుల అపార్ట్‌మెంట్స్

June 20, 2025
img

హైదరాబాద్‌లో భూముల ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో ఆకాశం వైపు మాత్రమే ఖాళీ కనిపిస్తోంది కనుక నగరంలో 20,30,40 అంతస్తుల అపార్ట్‌మెంట్స్ సర్వసాధారణం అయిపోయాయి. కోకాపేటలో ఎకరానికి రూ.101 కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేసిన సంస్థలు ఇప్పుడు మరో 20-30 అడుగులు ఆకాశం వైపు పయనిస్తున్నాయి. 

హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద ‘నియోపోలీస్’లో మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి 7 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,169 కోట్లు వ్యయంతో 63 అంతస్తులతో 5 బ్లాకులు నిర్మించబోతున్నాయి. ఐదు బ్లాకులలో 3,4 బీహెచ్‌కె ఫ్లాట్స్ నిర్మిస్తామని సదరు సంస్థలు తెలియజేశాయి. ఒక్కో ఫ్లాట్ 2,560-4,825 చ. గజాల విస్తీర్ణం చొప్పున మొత్తం 1,189 ఫ్లాట్స్ నిర్మిస్తామని తెలిపాయి. 

వీటిలో బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 7 అంతస్తులలో వహానాల పార్కింగ్ కోసం కేటాయిస్తామని జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా ప్రతినిధి కార్తీష్‌ రెడ్డి చెప్పారు. 

ఈ బహుళ అంతస్తుల భవన సముదాయంలో రెండు హెలీప్యాడ్స్, 5 బ్లాకులను కలుపుతూ 63 వ అంతస్తు సవ్వ ఓ స్కై బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. 

ఈ ఫ్లాట్స్ చదరపు గజం ధర రూ.10,000గా నిర్ణయించామని, ఇతర సదుపాయాలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుదని చెప్పారు. ఈ బహుళ అంతస్తుల నిర్మాణం కొరకు స్టేట్‌మెంట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.900 కోట్లు రుణం మంజూరు అయిందని తెలిపారు. 

Related Post