నెట్‌ఫ్లిక్స్‌లోకి గాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పటి నుంచంటే...

June 09, 2024


img

విశ్వక్ సేన్‌ హీరోగా చేసిన గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి రివ్యూలు తక్కువ రేటింగ్ ఇచ్చినప్పటికీ సినిమా బాగుండటంతో మంచి కలక్షన్స్‌ సాధించి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో జూన్ 14 నుంచి ప్రసారం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా సోషల్ మీడియాలో ఈవిషయం తెలియజేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్‌ తెలియజేసింది. 

గోదావరి లంక గ్రామంలో దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్‌ నటించాడు. ఆ ప్రాంతంలో నానాజీ (నాజర్), ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ)ల మద్య ఆధిపత్యపోరు జరుగుతుంటుంది. వారిద్దరినీ బురిడీ కొట్టించి రత్నాకర్ ఎమ్మెల్యే అవడం, నానాజీ కూతురు బుజ్జి (నేహాశెట్టి)తో ప్రేమలో పడటం మిగిలిన కధ. 

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకి  సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి, ఆర్ట్: గాంధీ నడికుండికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష